ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత్‌కు తీసుకొచ్చిన ఆఫ్రికన్ చిరుతలు ఎందుకు చనిపోతున్నాయి..? కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మరణాలకు అసలు కారణం ఏంటి..? ఆఫ్రికా, భారత్ మధ్య వాతావరణంలో ఉన్న తేడా వల్లే చీతాలు చనిపోతున్నాయా.. లేక వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా..?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. దీనిని తొమ్మిదేళ్ల సేవగా పేర్కొన్న ప్రధాని మోదీ.. గత తొమ్మిదేళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించినదేనని అన్నారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల వరద పారింది. బ్యాటర్లు పండగ చేసుకున్న ఈ సీజన్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 200కుపైగా స్కోర్లు అత్యధిక సార్లు నమోదైన రికార్డు నమోదైంది. ఇక సిక్స్‌ల రికార్డు కూడా బ్రేకయింది.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని విజయాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ మరో ముందడుగు వేసింది. ప్రధాని ప్రజలకు చేసిన సేవలను వివరించి మరోసారి దీవించాలని, ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
దేశంలోని మెట్రో సిటీలైన ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబయి, బెంగళూరూ, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్యసాధారణం. అయితే సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏమీ చేస్తారు.. ఏముంది.. కొద్దిసేపు వెయిట్ చేస్తాం లేదా.. పాటలు వింటూ ఉంటాం.. ఇంకా ఓపిక లేకపోతే ట్రాఫిక్ జామ్‌పై ప్రభుత్వాలను తిట్టుకుంటాం.
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ సురేష్ బాలు ధనోర్కర్(47) మంగళవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే తెలిపారు.
అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు.
ఝజ్జర్ కోట్లి సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది.
శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ సోమవారం అన్నారు.