కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని రాష్ర్టాలకు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను మంజూరు చేశాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల్లో ఎయిమ్స్ నిర్మాణాలను పూర్తి చేయలేదు.
ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మైనర్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈరోజు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ జెట్ చైనాలోని బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఎలాన్ మస్క్ ఉపయోగించే ప్రైవేట్ జెట్ బీజింగ్‌కు చేరుకుందని రాయిటర్స్ పేర్కొంది.
మే 9న లాహోర్‌లోని చారిత్రాత్మక కార్ప్స్ కమాండర్ హౌస్ లేదా జిన్నా హౌస్‌పై జరిగిన హింసాత్మక దాడిపై దర్యాప్తు చేస్తున్న సంయుక్త దర్యాప్తు బృందం మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పిలిపించింది.
స్వచ్చంద దివాళా పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘గో ఎయిర్’ మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఈ నెల రెండో తేదీన ఎన్సీఎల్టీ వద్ద గోఫస్ట్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విమానాలు నేలకు పరిమితం కావడంతో గోఎయిర్ కెప్టెన్లుగా ఉన్న పైలట్లు, ఇతర సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ చేస్తున్నారు.
మణిపూర్‌లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ మంత్రే అమిత్ షా మంగళవారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో సమావేశం అనంతరం శాంతి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలోని మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు బెయిల్ నిరాకరించింది.