Human Trafficking: సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), మహారాష్ట్ర పోలీసులు బుధవారం బీహార్-పుణె రైలులో ఆపరేషన్ నిర్వహించి మానవ అక్రమ రవాణాదారుల నుండి 59 మంది పిల్లలను రక్షించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్, నాసిక్ జిల్లాల్లోని భుసావల్, మన్మాడ్ వద్ద దానాపూర్-పుణె ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఈ పిల్లలను రక్షించినట్లు వారు తెలిపారు.
“విశ్వసనీయ సమాచారం ఆధారంగా, స్థానిక పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు, ఒక ఎన్జీవో సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని భుసావల్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 29 మంది ఎనిమిది నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను రక్షించారు. తరువాత మరొకరు మన్మాడ్ వద్ద రైలు నుంచి అదే వయస్సులో ఉన్న 30 మంది పిల్లలను రక్షించారు. ఐదుగురు వ్యక్తులను మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు చేశారు. ”అని ఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. ‘ఆపరేషన్ ఏఏహెచ్‌టీ’ కింద ఈ కసరత్తు జరిగిందని వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పిల్లలను బీహార్ నుండి తీసుకువచ్చి సాంగ్లీకి పంపిస్తున్నారని, ఐదుగురు నిందితులపై మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
Read Also: Bhagwant Mann: చరణ్‌జిత్ చన్నీ మేనల్లుడిపై పంజాబ్ సీఎం సంచలన ఆరోపణలు
ఒక ట్వీట్‌లో ఆర్పీఎఫ్ ఇలా పేర్కొంది. “పిల్లల అక్రమ రవాణా రింగ్‌ను ఛేదించడానికి రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రయాస్ వచ్చారు. భుసావల్, మన్మాడ్ స్టేషన్లలో 5 ట్రాఫికర్లను అరెస్టు చేయడంతో 59 మంది పిల్లలను రక్షించారు.” అని ట్విటర్ వేదికగా తెలిపింది.