టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా అగ్రస్థానంలో నిలిచారు. ప్యారిస్ ట్రేడింగ్‌లో ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ షేర్లు 2.6% పడిపోయిన తర్వాత బుధవారం నాడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు.
నేటి నుంచి ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
భారతదేశ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా బుధవారం ఓ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మినిచ్చారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీని తిరిగి కేటాయించారు.
ఎప్పుడూ ఏదో ఒక భారీ ప్రయోగం చేసే చైనా.. ఒకే రోజు రెండు భారీ సైన్సు ప్రాజెక్టులను ప్రారంభించింది. మంగళవారం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగా.. మరోవైపు షింజియాంగ్ ప్రావిన్స్‌లో అత్యంత లోతైన బోర్ తవ్వకానికి శ్రీకారం చుట్టింది. ఈ బోర్ లోతు 10,000 మీటర్లు ఉండనుంది.