Bhagwant Mann: మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు క్రికెటర్ జాస్ ఇందర్ సింగ్ నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. మే 22న చన్నీ మేనల్లుడు జషన్‌పై మొదటి సారి ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి.. ఆ రోజు క్రికెటర్ పేరు చెప్పలేదు. తాజాగా ఆ విషయంపై మాట్లాడుతూ ఐపీఎల్ ప్లేయర్ జాస్ ఇందర్ సింగ్, అతని తండ్రి మంజిందర్ సింగ్‌ల పేర్లు బహిరంగంగా చెప్పడం గమనార్హం. జాస్ ఇందర్ సింగ్ ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌లో భాగమని, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అని పిలుస్తారని, కానీ కానీ ప్లేయింగ్ 11లో భాగం కాదని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. మంజీందర్ సింగ్ చన్నీతో ఉన్న చిత్రాలను కూడా ముఖ్యమంత్రి చూపించారు. చన్నీ నుంచి తక్షణ స్పందన రానప్పటికీ, ఆయన భగవంత్ మాన్ వాదనలను అంతకుముందు కొట్టిపారేశాడు.
“జాస్ ఇందర్ సింగ్, అతని తండ్రి ఇక్కడి పంజాబ్ భవన్‌లో చన్నీని కలిశారు. తమ పని పూర్తి చేసుకోవచ్చని చన్నీ వారికి చెప్పారు.” అని భగవంత్ మాన్ ఆరోపణలు చేశారు. అప్పుడు చన్నీ మేనల్లుడు జషన్‌ను కలవమని చెప్పారని ఆయన చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని చూడటానికి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పుడు ధర్మశాలలో పంజాబ్ క్రికెటర్‌ను కలిశానని, స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడని భగవంత్ మాన్ గతంలో చెప్పాడు.
Read Also: Ustaad: భగత్ సింగ్ ని కాదు భగవంతుడిని…
తాను జషన్‌ను కలిశానని, తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని, అయితే రూ.రెండు కోట్లు కోసం డిమాండ్‌ను లేవనెత్తినట్లు క్రికెటర్ తనతో చెప్పినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ ఆటగాడు చన్నీ మేనల్లుడికి రూ.2 లక్షలు ఇవ్వగా.. రెండు అంటే రూ.2 కోట్లు అని జషన్ దుర్భాషలాడినట్లు సీఎం వ్యాఖ్యానించారు. మే 25 న చేసిన ట్వీట్‌లో, చన్నీ మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయడంలో విఫలమైతే, తన ఆరోపణలకు మద్దతుగా బహిరంగ చిత్రాలు, పేర్లను విడుదల చేస్తానని భగవంత్ మాన్ చెప్పారు. చెప్పినట్లుగానే ఈ రోజు పేర్లతో పాటు ఫొటోలను విడుదల చేశారు.