భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భారత వైమానిక దళానికి చెందిన కిరణ్ శిక్షణ విమానం కర్ణాటకలో నేలకూలింది. కర్ణాటకలోని చామరాజనగర్‌లోని మాకాలి గ్రామంలో విమానం క్రాష్ అయ్యింది.
క్రికెట్ అంటే ఇష్టం ఉన్నవారు ఇండియన్ ప్రీమీయర్ లీగ్(ఐపీఎల్) చూడకుండా ఉండరు. క్రికెట్ అభిమానులు ఎల్‌కేజీ వయసు నుంచి పండు ముసలి వరకు క్రికెట్‌ను ఆస్వాధిస్తారు. ఐపీఎల్ కోసం నెల రోజుల ముందు నుంచే సీజన్ చూడటానికి ప్లాన్ చేసుకుంటారు.
మణిపూర్‌లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు.
ఉత్తరాఖండ్‌లో ఛార్‌దామ్ యాత్రకు ఈ సారి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. చార్‌దామ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు మంచుకొండల్లోని కొండ చరియలు విగిపడుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి పొట్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేశినేని నానిపై మండిపడుతూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
వరుసగా ఐదో సారి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
బస్సులో ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకోవాలి.. లేదంటే బస్ పాస్ ఉండాలి.. అది కాదంటే రవాణా శాఖకు చెందిన ఉద్యోగులైనా అయి ఉంటే వారు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది. మరీ ఉచితంగా బస్‌లో ప్రయాణం చేయాలంటే ఎలా..
విదేశాల్లో ఉన్నత చదువులంటే విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు. పైగా పేరున్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అయితే ఇంకా గర్వంగా ఫీలవుతారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లల్లో విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే భయపడిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇపుడు ఆ భయం నుంచి బయటికొచ్చేశారు.