Tamilnadu Transport to students: బస్సులో ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకోవాలి.. లేదంటే బస్ పాస్ ఉండాలి.. అది కాదంటే రవాణా శాఖకు చెందిన ఉద్యోగులైనా అయి ఉంటే వారు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది. మరీ ఉచితంగా బస్‌లో ప్రయాణం చేయాలంటే ఎలా.. అంటే అది కూదరదు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఇపుడు విద్యార్థులకు ఉచితంగా బస్‌లో ప్రయాణం చేసేలా అనుమతి ఇచ్చింది. అదెలా? అంటే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు యూనిఫాంతో బస్ ఎక్కితే వారిని పాస్ అడగొద్దని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని కొన్ని రాష్ర్టాలు 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు ఉచిత బస్ ప్రయాణం అవకాశం కల్పించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి వరకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా బస్‌లో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు అలాగే ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులకు రాయితీతో కూడిన బస్‌పాస్‌ను అందిస్తోంది. అందులోనే రూట్ పాస్ ఇస్తారు.. 6 నెలలకు,, 3 నెలలకు కలిపి పాస్‌లను ఇస్తుంటారు.
ఇపుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా విద్యార్థులకు ఉచితంగా బస్‌లో ప్రయాణించడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు యూనిఫాంలో పాఠశాల గుర్తింపుకార్డుతో వస్తే వారిని ఉచిత ప్రయాణానికి అనుమతించాలని రవాణా శాఖ ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (ఎంటీసీ) డిపో మేనేజర్లకు ఆ రాష్ట్ర రవాణా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థినీ, విద్యార్థులు ఉచితంగా ప్రయాణం చేసేలా కొత్త బస్‌పాస్ అందజేసేందుకు వారి వివరాలు సేకరిస్తున్నామని, అనంతరం పాస్‌లు ముద్రించి, ల్యామినేషన్ చేసి అందించడానికి కొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. కానీ కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 7వ తేది నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున కొత్త బస్‌పాస్‌లు అందజేసే వరకు యూనిఫాంతోపాటు పాఠశాల గుర్తింపుకార్డుతో వచ్చే విద్యార్థులను ఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిచేందుకు అనుతించాలని స్పష్టం రవాణా శాఖ చేసింది. నిబంధనలను పాటించకుండా ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే కండక్టర్లపై తగిన చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ స్పష్టం చేసింది.