రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది.
ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలతో ఘర్షణకు దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు.
సూడాన్‌లో నెలకొన్న అంతర్యుద్ధం మూలంగా దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు.
మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది.