Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఛార్‌దామ్ యాత్రకు ఈ సారి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. చార్‌దామ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు మంచుకొండల్లోని కొండ చరియలు విగిపడుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండ చరియలు విరిగి పడటంతో రోడ్లు కూడా ధ్వంసం అవుతుండటంతో వారి ప్రయాణం ముందుకు సాగడం లేదు. భారీగా కొండచరియలు విరిగి పడటంతో సుమారు 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు.
చార్‌ధామ్ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. భక్తుల యాత్రకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్‌పూర్ సమీపంలో లిపులేఖ్-తవాఘాట్ రోడ్డు వంద మీటర్ల మేర ధ్వంసమైంది. దీంతో ధార్చులా, గంజీలో సుమారు 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. దెబ్బతిన్న రోడ్డును మరమ్మత్తు చేయడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశి, ఉదంసింగ్‌నగర్, గర్వాల్, చమోలీ, అల్మోరా సహా పలు జిల్లాల్లో దూళి, ఉరుములతో కూడిన వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు కోరారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Read Also: AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..
అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనాలను జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలని సూచించారు. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చేవారు వాతావరణ పరిస్థితులను బట్టి తమ యాత్రను కొనసాగించాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని.. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చే ప్రయాణీకులు వాతవారణ సూచన తర్వాతనే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని.. తమ వెంట రెయిన్ కవర్, గొడుగు, వెచ్చని వస్ర్తాలు ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ రెండో వారం వరకు ఈ యాత్ర సాగనుంది.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!