ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కనిపించే ఏకైక వస్తువు మొబైల్ ఫోన్. ఇది లేకుండా ఉండే మనిషి లేడంటే ఆశ్యర్యమే! ఇక ప్రతి రోజూ లేవగానే తన మొఖం తాను చూసుకోవడం కంటే ముందే తన మొబైల్ ఫోన్ ఎక్కడుందా? అని వెతుక్కుంటారు. మొబైల్ ఫోన్ వాడకానికి వయస్సుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు మొబైల్ ఫోన్‌ను వినియోగిస్తున్నారు.
అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ఆయన తన చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అతనెవరో కాదు అమెరికా అధ్యక్షులు జో బైడెన్. ఉన్నట్టుండి మరచిపోవడం.. ఒకవైపు వెళ్లాల్సి ఉండి మరోవైపు వెళుతుండటం.. ఉన్నట్టుండి కిందపడిపోవడం ఇటువంటి చేష్టలతో ఆయన సోషల్ మీడియాలో ఉంటారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.