Amit Shah Warning : ఆయుధాలు అప్పగించని వారికి అమిత్ షా సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Warning : మణిపూర్‌లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు. అలాగే మణిపూర్‌లో జరిగిన జాతి హింసపై రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేస్తుందని అమిత్ షా ప్రకటించారు. మణిపూర్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ర్టంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా తానే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. గత సోమవారం నుంచి హోం మంత్రి మణిపూర్ రాష్ట్రంలోనే పర్యటిస్తూ వివిధ సంఘాలతోపాటు.. స్థానిక ప్రజలతో కూడా కేంద్ర హోం మంత్రి సమావేశమయ్యారు. సోమవారం రాత్రి ఇంఫాల్‌కు చేరుకున్న తర్వాత అమిత్ షా వివిధ కుకీ మరియు మెయిటీ నాయకులు, ఉన్నత భద్రతా అధికారులు మరియు మణిపూర్ క్యాబినెట్‌తో జాతి హింసకు పరిష్కారం కోసం వరుస సమావేశాలను నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణల మూలంగా మోరేన్ పట్టణం ఎక్కు్వగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమిత్ షా బుధవారం మోరేన్‌లో పర్యటించారు. అక్కడ కుకీ పౌర సమాజ నాయకులతో పాటు మెయిటీ నాయకులతోనూ హోం మంత్రి సమావేశం నిర్వహించారు.
మణిపూర్‌లో ఆయుధాలను అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హెచ్చరించారు. రాష్ట్రంలో సుస్థిరతను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా హింసాకాండపై విచారణ, శాంతి కమిటీని కూడా ఆయన ప్రకటించారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసపై రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేస్తుందని అమిత్ షా ఈశాన్య రాష్ట్రంలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా వరుస సమావేశాల తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. గవర్నర్ మరియు భద్రతా సలహాదారు కులదీప్ సింగ్ మరియు సివిల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు.
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
హింసకు సంబంధించిన ఆరు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సీబీఐ విచారించనుంది. దర్యాప్తు తటస్థంగా ఉంటుందని మరియు హింస వెనుక ఉన్న కారణాల మూలాల్లోకి వెళుతుందని అమిత్ షా తెలిపారు. భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను దోచుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. ఆయుధాలను అప్పగించకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. హింసలో మరణించిన వారి కుటుంబాలకు మణిపూర్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 10 లక్షల పరిహారాన్ని అందజేస్తాయని షా చెప్పారు. నెల గడిచినా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంతో ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కుకీ-హ్మార్-జోమీ-మిజో తెగల సభ్యులు బుధవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Read Also: Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైటేయి కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించబడిన తర్వాత జాతి హింస మొదట చెలరేగింది. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుండి కుకి గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస ముందుకు సాగింది. అది కాస్త ఆందోళనలకు దారితీసింది. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉండగా.. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు మరియు కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు మరియు కొండ జిల్లాలలో నివసిస్తున్నారు. మణిపూర్ హింసలో ఇప్పటివరకు 80 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!