ఈ హుస్నాబాద్ గడ్డ సర్దార్ సర్వాయి పాపన్న, పీవీ నరసింహారావుల గడ్డ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక ప్రసంగించారు. పీవీ నరసింహారావు మా తండ్రి రాజీవ్ చనిపోయినప్పుడు మా కుటుంబానికి అండగా ఉన్నారని ఆమె తెలిపారు.
కుల గణన ప్రక్రియ వాయిదా పడిందని.. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. పేదల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకే కులగణన అంటూ ఆయన పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు మజీద్‌ల వద్ద శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులను కలిశారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉందని.. మీకు అండగా నిలిచిన పార్టీని, ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బాగంగా బీజేపీ పార్టీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telugu News, National News, International News, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections,
ఎన్నికలలో నిలబడే వివిధ రాజకీయ పార్టీల నాయకుల గుణగణాలు తెలుసుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల భవిష్యత్ చూసి బీఆర్ఎస్‌కు ఓటు వేసి, ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపించాలన్నారు.
వనపర్తిని జిల్లా కేంద్రం కావడంతో నూతన మండల ఏర్పాటులో భాగంగా గ్రామ పంచాయతీగా ఉన్న శ్రీ రంగపురంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, కూతుర్లు ప్రత్యూష, తేజశ్వినిలు అన్నారు.