ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు.
కరీంనగర్ నగర అభివృద్ధి కొరకు స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్‌కి తొడ కొట్టి సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్‌లో ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దోపిడీ దొంగ రేపు మీ వ్యాపార సంస్థలను వేధించి మామూలు వసూలు చేస్తాడని ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా మరోవైపు ప్రముఖుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుసగా తనిఖీలు నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆయన కుమారుడు చర్లకోల స్వరణ్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డికి అండగా ఉండి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నీళ్లు జగన్ తీసుకెళ్లిండు, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ తీసుకెళ్లారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.
విశాఖ రావాలన్న సీఎం నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏపీ ఐటీ మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి విశాఖకు వస్తుంటే ఎందుకు అభ్యంతరమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పాలన్నారు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నై పాలెం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం విజయవాడకు వెళుతున్న కారులో డ్రైవర్ నిద్ర మత్తు లోకి జారుకోవడంతో రోడ్డు దాటుతున్న మహిళను అనంతరం ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది.