Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: జై బోలో తెలంగాణ అని నినదించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామికి జై కొట్టారు ప్రియాంకా గాంధీ. ఝాన్సీ రెడ్డి కుటుంబం చాలా సేవాభావం గల కుటుంమని ఆమె వెల్లడించారు. రైతుల భూములు లాక్కునే కుటుంబం బీఆర్‌ఎస్ కుటుంబం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని.. ఈ రాష్ట్రం పురోగతి చెందాలంటే మీ ఓటు విలువైనది అంటూ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. త్యాగం చేసిన వాళ్లు ఒకవైపు, దోపిడి చేసిన వాళ్లు మరోవైపు.. అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు. మీరు కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే, పేపర్ లీకులు అవుతున్నాయని.. పేపర్ లీకులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యల కారణాలను కూడా ఈ ప్రభుత్వం వక్రీకరించిందని మండిపడ్డారు.
Also Read: DK Shivakumar: కేసీఆర్, కేటీఆర్‌లను ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌజ్‌కి పంపండి
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
పేపర్ లీకేజీల కుంభకోణాన్ని అరికట్టడానికి జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుందన్నారు. మా అక్క చెల్లెళ్లకి క్షమాపణ చెప్తున్నా.. ఇంత సేపు నాకోసం అన్ని పనులు వదిలేసి వచ్చినందుకు అంటూ ప్రియాంక చమత్కరించారు. గ్రామ గ్రామాన వైన్స్, బెల్ట్ షాపులు అక్కా చెల్లెళ్ళ జీవితాలను పాడుచేస్తున్నాయన్నారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు బాగా జరుగుతున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు ప్రియాంకా గాంధీ. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని ఆమె విమర్శించారు. రైతు సంపాదించిన భూములను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని ఆమె ఆరోపించారు. రైతులకి కనీస మద్దతు ధర కచ్చితంగా ఇస్తామని.. కేసీఆర్ సర్కార్ వచ్చి 10 సంవత్సరాలు గడిచినా అన్యాయమే జరుగుతోందని ప్రియాంక విమర్శించారు.
Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన
మందులకి చివరి తేదీ ఎలా ఉంటాదో.. అలా బీఆర్‌ఎస్‌కు ఎక్సపైరీ తేదీ ఇప్పుడు వచ్చిందన్నారు. ప్రభుత్వాలు మీ ఆలోచనలను మరిచి వాళ్ల కుటుంబ పాలన కోసం పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం ఈ ప్రభుత్వం ఫామ్ హౌస్‌లకే పరిమితం అంటూ విమర్శించారు. దళితులకు ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో చాలా లక్షల కోట్ల కుంభకోణం చేసి దోచుకున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేనని.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దొరల తెలంగాణ చేసిందని.. మేము వచ్చాక దొరల తెలంగాణని ప్రజల తెలంగాణ చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..