Seediri Appalaraju: డిసెంబర్ మొదటి వారం నుంచే సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని.. విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అంటూ పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం విశాఖను రాజధానిగా చేయాలనుకున్నారని మంత్రి చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర వెనుకబాటును గుర్తించి.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే గానీ అభివృద్ధి చెందదని భావించారన్నారు.
కోర్టులలో ఓ పక్క పోరాటం చేస్తూనే.. మరో వైపు పరిపాలన, సమీక్షలు చేయడానికి కార్యాలయాలు చూశారని ఆయన చెప్పారు. టీడీపీ, దత్తపుత్రుడు విషం చిమ్ముతున్నారని.. మిలీనియం టవర్స్, రుషికొండ గెస్ట్ హౌస్‌ని కబ్జా చేస్తున్నామంటున్నారని ఆయన మండిపడ్డారు. అదేమన్న మీ బాబు ఆస్తి నా… అవి ప్రభుత్వ భవనాలు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భవనాలు వ్యక్తులకు సొంతం అవ్వదని.. చంద్రబాబు, లోకేష్, పవన్ అడ్రస్‌లు హైదరాబాద్ అని.. హైదరాబాద్‌లో ఉండి.. ఆంధ్రా ప్రజలకు నిర్దేశిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఇంత బానిసత్వం అవసరమా అంటూ వ్యాఖ్యానించారు. బోగాపురం, మూలపేట పోర్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖలో ఐటి ఇండస్ట్రీ తెచ్చింది వైఎస్సార్ అని.. మీరు చేసిందేంటి అని టీడీపీని ప్రశ్నించారు.
Also Read: Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం
పెద్ద పెద్ద క్యాంపస్‌లు ఇన్ఫోసిస్ లాంటివి వస్తున్నాయని.. సరైన కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమ బాటపడతారని మంత్రి చెప్పుకొచ్చారు. వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్రం గురించి మాట్లాడుకో పవన్ అని మండిపడ్డ మంత్రి.. పక్క రాష్ట్రంలో ఏపీ ప్రతిష్ఠ దిగజార్చేలా మాట్లాడొద్దని హితవు పలికారు. పవన్ కాన్సెప్టేంటి… తెలంగాణలో బీజేపీ. ఇక్కడ టీడీపీతో అలియన్స్ ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇది అంటూ విమర్శలు గుప్పించారు. పవన్ నిజజీవితంలో, రాజకీయాల్లో ఓకేలా ఉన్నాడని.. విలువలు లేకుండా ఉన్నాడని మండిపడ్డారు. నారా లోకేష్ పనికిమాలినవాడని పేర్కొన్న మంత్రి.. అసలు అందులో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా అంటూ ప్రశ్నించారు. సింగిల్ విండో ద్వారా కంపెనీలకు అనుమతులిస్తున్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని ప్రకటించి.. హైదరాబాద్ హోటల్లో ఉండ లేదా అంటూ ప్రశ్నించిన మంత్రి.. సీఎం ఇక్కడే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.