Chelluboina Venugopal: కుల గణన ప్రక్రియ వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chelluboina Venugopal: కుల గణన ప్రక్రియ వాయిదా పడిందని.. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. పేదల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకే కులగణన అంటూ ఆయన పేర్కొన్నారు. కుల గణనపై జిల్లా, రీజినల్ స్థాయిల్లో కుల పెద్దలతో సమావేశాలు ముగిశాయన్నారు. కుల సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అందుకే కుల గణనను వాయిదా వేశామని స్పష్టం చేశారు. ఎక్కువ మంది అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ముందుకెళ్తామన్నారు. కుల గణనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని కామెంట్స్ చేశారు. సామాజిక సాధికారతకు సీఎం జగన్ చిరునామా అని వ్యాఖ్యలు చేశారు.
Also Read: Seediri Appalaraju: విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష.. ఇక అక్కడి నుంచే పాలన!
Also Read
- Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
- Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
- Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
కులాలవారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు?. వారి జీవన స్థితి ఎలా ఉందని తేల్చాలని చాలాకాలంగా డిమాండ్ ఉందన్నారు. సామాజిక సాధికారతకు చిరునామా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీ, మండలి, పార్లమెంట్‌లో సీఎం జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని మంత్రి తెలిపారు. మహిళలకు సగం రిజర్వేషన్ కల్పించారు. సోషల్ జస్టిస్ ఆచరించటంలో సీఎం జగన్ విజయం సాధించారని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?