Priyanka Gandhi: ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిమయం.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రియాంక ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ఈ హుస్నాబాద్ గడ్డ సర్దార్ సర్వాయి పాపన్న, పీవీ నరసింహారావుల గడ్డ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ విజయభేరీ సభలో ప్రియాంక ప్రసంగించారు. పీవీ నరసింహారావు మా తండ్రి రాజీవ్ చనిపోయినప్పుడు మా కుటుంబానికి అండగా ఉన్నారని ఆమె తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గండిపల్లి, గౌరవెల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తికాలేదని.. నిర్వాసితులకు పరిహారం రాలేదని ఆమె పేర్కొన్నారు. ప్రజల భూములు గుంజుకున్నప్పుడు ఇక్కడి ఎమ్మెల్యే ప్రజలకు అండగా లేరని ఆమె విమర్శించారు. రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నపుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు.
Also Read: Himantha Biswa Sharma: వికారాబాద్ జిల్లా పరిగిలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రోడ్ షో..
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినప్పుడు అడ్డుకోని ఎమ్మెల్యే హుస్నాబాద్‌కి అవసరమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. సీఎం కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి… తెలంగాణ బిడ్డలకు రాలేదని ఆమె విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగం దేశంలో కంటే ఎక్కువగా వుందన్నారు. డిగ్రీలు చదివిన పిల్లలకు ఉపాధి లేదన్న ఆమె.. పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు ఎదిగిన బిడ్డలకు ఉపాధి లేక నిరాశే మిగులుతుందన్నారు. పేపర్ లీకులు, నోటిఫికేషన్ల రద్దుతో అవినీతితో యువతకు ఉద్యోగాలకు నోచుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలల్లో ఒకటైన నియామకాలు, ఉపాధి ఈ పదేళ్ళలో తీరలేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని.. రక్షణ లేదన్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయన్నారు.
రైతులకు రుణమాఫీ చేయలేదు.. మా పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ చేశామన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కేసీఆర్, మోడీకి రైతుల పట్ల రుణమాఫీ పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. దేశంలో ఉన్న సంపద మొత్తం అదానీకి దోచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు. అదానీ ఆదాయం ఒక రోజుకు 1600 కోట్లు అంటే దోపిడీ ఎంత జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోరు సాగుతోందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన చూశారు… కాంగ్రెస్ హామీలను చూడాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ బీజేపీ , ఎంఐఎం మూడు ఒక్కటేనని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కి ఎంఐఎం మద్దతు ఇస్తుందన్నారు.
Also Read: Rajnath Singh: ఈ సారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ..” దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అన్ని స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎం సొంత రాష్ట్రంలో 7 సీటల్లోనే ఎందుకు పోటీ చేస్తుంది. ఈ మూడు పార్టీలు బయట ఫైట్ చేస్తున్నట్టు నటించి లోపల నాటు నాటు డ్యాన్స్ చేస్తాయి. మహాత్మా గాంధీ నుంచి నేటి వరకు పేదల కోసం వారి హక్కుల కోసమే పని చేస్తుంది. దేశంలో సంపద సృష్టిస్తున్న వారికి సంపద పై హక్కులు కావాలని కోరుతుంది కాంగ్రెస్. ఇక్కడ ఆరు గ్యారంటీలు హామీ ఇస్తున్నాం… వాటిని అమలు చేసి తీరుతాం..ఆ గ్యారంటీలకు నాది బాధ్యత. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం..ఈసారి బై బై కేసీఆర్ అని కాంగ్రెస్ ని గెలిపించండి. మీ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన వస్తుంది..ఈ రాష్ట్రం మీది మీ పోరాటం వల్ల వచ్చిన రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యత మీది..” అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!