Rajnath Singh: ఈ సారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బాగంగా బీజేపీ పార్టీ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆయనతో పాటు మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, తాను చేసిన సేవలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలకు అంతేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఈ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలిపారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. 27 సంవత్సరాలుగా గుజరాత్ ను దేశంలోనే ఒక మాడల్ గా అభివృద్ధి చేశామని, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. అటల్ బిహారీ వాజపేయి నుంచి మోడీ వరకు బీజేపీ ప్రభుత్వాలు నాయకులపై ఏ ఒక్క అవినీతి మచ్చ లేదని అన్నారు. కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మోసం చేసి పేపర్ లీకేజీలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని ఏ ఒక్క దళితునికి ఇవ్వలేదన్నారు. 10 లక్షల దళితబంధు ఎవరికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఉందని బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?