Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్‌కు ఇది కీలక పరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kristalina Georgieva: ఏఐ అంటేనే ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు భయంగా మారింది. తాజాగా మరో వార్త టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ ఉద్యోగ రంగాన్ని కుదిపేసే భారీ మార్పులు కృత్రిమ మేధస్సు వల్ల రాబోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టలినా జార్జీవా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువతకు ఇది పెద్ద సవాల్‌గా మారబోతోందని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం 60 శాతం వరకు ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో ఈ ప్రభావం సుమారు 26 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఖ్య తక్కువగా కనిపించినా ఏటా లక్షలాది మంది ఉద్యోగ రంగంలోకి వస్తున్న దేశంగా భారత్‌కు ఇది చిన్న విషయం కాదు. ప్రవేశ స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా పునరావృత పనులు ఉండటంతో అవి ఆటోమేషన్‌కు త్వరగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మాత్రమే కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకునే సామర్థ్యం కూడా అవసరమని ఆమె వివరించారు.
READ MORE: T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
పాలసీల విషయంలో ప్రపంచం ఇంకా వెనుకబడిపోయిందని క్రిస్టలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు ప్రజలను సిద్ధం చేసే విధానాలు వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే సరైన రీతిలో ఉపయోగించగలిగితే ఏఐ భారత్ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 0.7 శాతం వృద్ధిని తీసుకురాగలదని వివరించారు. దీని ద్వారా దేశం దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు దగ్గరవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. పన్ను వ్యవస్థలో మార్పులు, కార్మిక రంగంలో సంస్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బలమైన డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ దేశాన్ని మరింత పోటీ సామర్థ్యం కలిగినదిగా మార్చాయని అన్నారు. పదేళ్ల క్రితం చూసిన భారత్‌తో పోలిస్తే ఇప్పుడు అవకాశాలకు మరింత పెరిగాయని, సులభతరంగా మారయన్నారు. ఇక ముందు ప్రధానంగా చేయాల్సిన పని విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా మార్చడమేనని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!