KP Krishnamohan Reddy: మార్కాపురం నియోజకవర్గ క్లస్టర్ ఇంఛార్జి రాంరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి.. వారి కుటుంబం పేరు మీద ఉన్న 1119 సర్వే నంబర్‌లోని 21న్నర ఎకరాల భూమి విషయంలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి మేము ఫిర్యాదు చేయలేదని చెప్పించారని ఎమ్మెల్యే కేపీ సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ భూమి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీదకు ఎలా ఎక్కిందో చెప్పాలని సవాల్ విసిరారు. అది దళితుల పొలమని, ఆ పొలం మీ పేరు మీదకు ఎలా వచ్చిందో చెప్పాలని కృష్ణమోహన్ రెడ్డి ప్రశ్నించారు. దానికి రాంరెడ్డి సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Also Read: Gangula Kamalakar: బండి సంజయ్‌కు తొడకొట్టి సవాల్ విసిరిన మంత్రి గంగుల
ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయంలో అనువంశికం అని రికార్డులో ఎక్కించారని.. దళితుల పొలం వారి పేరు మీదకు ఎలా ఎక్కిందని ప్రశ్నించారు. దానికి కందుల కుటుంబం వివరణ ఇవ్వాలని, ఇచ్చే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. అలా వివరణ ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి ప్రెస్‌మీట్‌లో కూర్చోబెట్టి, ఇతరులపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మేము బ్యాంకులో లోన్ తీసుకుని ఎగ్గొట్టారని ప్రెస్‌మీట్‌లో రాంరెడ్డి వ్యాఖ్యానించారని.. కానీ తాము ఆస్తులు తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నామని కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నకేశవ స్వామి ఆలయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. నాలుగున్నరేళ్ల నుంచి మాపై చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.