Koti Deepotsavam 11th Day: ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది.
Also Read: Raithubandhu: రైతులకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి
ఈరోజు కోటిదీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలు చూసుకుంటే.. ఎంతో చక్కగా ఇల కైలాసాన్ని తలపించింది. అంతేకాకుండా.. ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీపరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం జరిగింది. హైదరాబాద్ జగన్నాథ మఠం శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతాన్ని వినిపించారు. వేదికపై కొల్హాపూర్ మహాలక్ష్మీకి కోటి కుంకుమార్చన జరిపించారు. భక్తులచే లక్ష్మీ విగ్రహాలకు కోటి కుంకుమార్చన నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణాన్ని చూసి భక్తజనులు పులకరించిపోయారు. స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. వీటన్నింటితో పాటు అబ్బురపరిచే కళాసంబరాలు, అంబరాన్నంటే మహానీరాజనాలు ఎంతో ఘనంగా జరిగాయి. చివరకు కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులతో 11వ రోజు కోటి దీపోత్సవం ఘనంగా ముగిసింది.

ఇలా ఎన్నో విశేషాలకు వేదికైన కోటిదీపోత్సవానికి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేయడం జరుగుతోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే దీప యజ్ఞంలో పాల్గొనండి..
https://www.youtube.com/watch?v=OELlRt6Fol8&ab_channel=BhakthiTV