Road Accidents: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నై పాలెం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం విజయవాడకు వెళుతున్న కారులో డ్రైవర్ నిద్ర మత్తు లోకి జారుకోవడంతో రోడ్డు దాటుతున్న మహిళను అనంతరం ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో రోడ్డు దాటుతున్న మహిళతో పాటు ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు దాటుతున్న మహిళను మద్దూరు పాడు గ్రామానికి చెందిన సుబ్బమ్మగా.. మరో ఇద్దరు విజయవాడకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కారులో ఇరుక్కున్న వ్యక్తిని పోలీసులు బయటికి తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Also Read: Fish Farming: చేపల పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజక వర్గం నారాయణవనం మండలం సముదాయం వద్ద మరో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కళాశాల బస్సు కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.