దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని... కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సబ్‌స్టేషన్లు, విద్యుత్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్‌పీసీఎల్‌తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై అవగాహనా ఒప్పందం జరిగింది.
మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. ఈ సందర్భంగా ఓవైసీ అసదుద్దీన్, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిపై బహిరంగ సభలో నిప్పులు చెరిగారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దీనదయాల్ నగర్ బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతమని వెల్లడించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్(భారత్ రాష్ట్ర సమితి) రైతు బంధు పథకం కింద డబ్బు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో 2023లో కూడా 2018 పునరావృతం కాగలదని ఆశించింది. ఇది ఎన్నికల ఫలితాలను నడిపిస్తుందని.. భారీగా ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్ ఆశాభావం వ్యక్తం చేసిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో తొలుత ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో ఎన్టీవీ- భక్టి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విశిష్ఠ అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి న రచన టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచన చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవన్నారు. నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వనాశనం చేసిందన్నారు. నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నదని.. తాత్కాలికంగా కాంగ్రెస్ రైతుబంధును అడ్డుకోగలదేమో .. డిసెంబరు 3 తర్వాత అడ్డుకోలేదన్నారు.
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు.