Bandi Ramesh: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దీనదయాల్ నగర్ బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతమని వెల్లడించారు. బస్తీని ఆనుకొని ఉన్న నాలా కొద్దిపాటి వర్షానికి ఆ మురుగు నీరు కాలనీలోకి వచ్చి నివాసముంటున్న ఇండ్లలోకి మురికి నీరు చేరుతుండటంతో నివాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
Read Also: Jagga Reddy: నా మనసులో మాట చెప్తున్నా.. వీడియో విడుదల చేసిన జగ్గారెడ్డి
ఫతేనగర్ డివిజన్‌లో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఫుట్ పాత్‌లు ఆక్రమణలకు గురి అయ్యాయన్నారు. దీనివల్ల ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్‌లో పాదచారులు వాహనాదారులు పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురైయ్యారని చెప్పారు. తేనగర్ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా దయనీయంగా ఉందన్నారు. సరైన వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఫతేనగర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు రవాణా సౌకర్యం లేకపోవడంతో బస్సుల కోసం బాలానగర్ బస్ స్టాప్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. లక్షలు వెచ్చించి కట్టినటువంటి కమ్యూనిటీ హాల్లు నిర్వాహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. ఫతేనగర్ డివిజన్ భరత్ నగర్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందని.. ఇక్కడ ఉన్న ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ఆర్టీసీ సౌకర్యం లేకపోవడం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.