Chelluboina Venugopal: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో తొలుత ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులు పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని డాక్టర్లు సూచన మేరకు ఆస్పత్రిలో మంత్రి వేణుగోపాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మంత్రి వేణు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
Read Also: PM Modi: కోటి దీపోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం: ప్రధాని మోడీ
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి అనే వార్తలు అవాస్తవమని ఆయన కుమారుడు చెల్లుబోయిన నరేన్ తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. కొన్ని మీడియాలు చూపిస్తున్నట్లు గుండె జబ్బు కాదన్నారు. కేవలం అస్వస్థతకు గురయ్యారని.. రేపు ఇంటికి వచ్చేస్తారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.