Pawan Kalyan: దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని… కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. జనసేన ఏ మతానికి చెందినది కాదు… సబ్ కా సాత్… అంటూ మోడీ ఏ ఉద్దేశంతో అన్నారో అదే ఉద్దేశంతో తాను పనిచేస్తున్నానన్నారు. తనకు జన్మ ఆంధ్ర ఇస్తే… తెలంగాణ నాకు పునర్జన్మను ఇచ్చిందని పవన్ చెప్పారు. తాను తెలంగాణకి ఋణపడి ఉన్నానన్నారు. తెలంగాణ వస్తే… రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన జలయజ్ఞం అవినీతి వంటి రాజ్యం కాకుండా మంచి పాలన వస్తుంది అని అనుకున్నామన్నారు. కానీ అదే పాలన కొనసాగుతోందన్నారు. మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని పవన్ వెల్లడించారు.
Read Also: Vijayashanti: కేసీఆర్ పతనం మొదలైంది.. ప్రకృతి కూడా సహకరించడం లేదు
సీఎం సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే… మీ కోరిక తీరుతుంది అంటూ సమాధానమిచ్చారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్. తాను ఏ రోజు మతం చూడలేదు… మానవత్వం మాత్రమే చూశానన్నారు. మీకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. ఎలక్షన్ ప్రచారం సమయం అయిపోతుంది… ప్రతి జనసైనికుడికి అండగా ఉంటామన్నారు. రైతులకు అండగా నిలబడుతామని.. ఆడబిడ్డల భద్రత చాలా ముఖ్యమన్నారు. ఆంధ్రలో ఎంతోమంది అమ్మాయిలు మాయం అయ్యారో ఇక్కడ కూడా అలాగే మాయమవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దాని ఫలాలు ఆ విధంగా లేవన్నారు. బీసీ నాయకులను సీఎంగా బీజేపీ ప్రకటించిందని.. బీసీల నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని పవన్ ఆకాంక్షించారు. ఆంధ్ర నుంచి హైద్రాబాద్‌కి వచ్చిన 26 కులాలను బీసీలుగా తీసేసారని ఆయన మండిపడ్డారు.
Read Also: CM KCR: తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా..
ఎందుకు తీసేసారు అని అడగలేదన్నారు. అక్కడ సీఎంకి ఇక్కడి సీఎం దగ్గరి వారు అని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం బూర్గుల రామకృష్ణారావు ఎంత పోరాటం చేశారని తెలిపిన పవన్.. కానీ గుర్తింపు రాలేదన్నారు. అందుకే మేము అధికారంలోకి రాగానే ఆంధ్ర లో అధికారంలోకి రాగానే బూర్గుల విగ్రహం, గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. గద్దరన్న రిక్వెస్ట్ చేశారు తెలంగాణలో కూడా నిలబడాలని… ఆయనకి ప్రామిస్ చేశాను… నిలబడుతానని తెలిపారు. గాజు గ్లాస్ గుర్తు… బ్యాలెట్‌లో 7వ నంబర్ గుర్తుంచుకుని .. అందరూ అండగా నిలబడాలని కోరారు.