CM KCR: బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 15 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని సీఎం తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో కలిపారని.. 58 ఏళ్ళు ఎన్నో గోసలు పడ్డామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనకి తేడా గమనించాలన్నారు. ఆలోచించి ఓటు వేయాలి..ఓటే మనకు వజ్రాయుధమన్నారు సీఎం కేసీఆర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నారని.. రైతు బంధు ఉండాలంటే బీఆర్‌ఎస్ గెలవాలని సీఎం ప్రజలకు సూచించారు. పీసీసీ చీఫ్ రేవంత్ 24 గంటల కరెంట్ వేస్ట్ అని మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతాయన్నారు.
Read Also: Bhupesh Baghel: కాంగ్రెస్తో కేసీఆర్కు భయం పట్టుకుంది…
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చానన్న ఆయన.. రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతు బంధు రాదు.. దళారుల రాజ్యం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ఈ సందర్భంగా చెప్పారు. గవర్నర్ వల్ల కాస్త లేట్ అయ్యిందని.. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తామన్నారు. సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ..నా జిల్లా అని సీఎం తెలిపారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ను ఓడగొట్టినా నేను ఏమి అనలేదని.. 24 గంటల త్రాగునీరు వచ్చే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. ఒక పార్టీ మత పిచ్చి పార్టీ..ఎంత సేపు మసీదులు తవ్వుదామా ప్రజల మధ్య లొల్లి పెట్టడమే వాళ్ళకి పని అంటూ సీఎం మండిపడ్డారు.
Read Also: KTR: ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దు..
సంగారెడ్డి హైదరాబాద్‌లో అంతర్భాగం అవుతుందని.. సంగారెడ్డికి మెట్రో వస్తే మీ దశ మారిపోతుందన్నారు. మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే…రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో వేయవచ్చన్నారు. కారుని గుద్దిన, నా ఓట్లు నేనే గుద్దుకున్న అన్న ఎమ్మెల్యే కావాలా అంటూ ప్రశ్నించారు. ఈ ఉద్యమ ద్రోహి మొదట బీఆర్‌ఎస్‌లోనే ఉండే అంటూ జగ్గారెడ్డిపై సీఎం అయ్యారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడన్నారు. 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదన్నారు. వంద ఉత్తరాలు రాసినా ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మార్చి తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!