ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు.
విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని.. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని మంత్రులకు, అధికారులకు వివరించారు.
విశాఖపట్నంలోని జూపార్క్‌లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వ్ అటవీప్రాంతంలో ఈరోజు పార్శిల్ రైలు ఢీకొన్న ప్రమాదంలో మూడు ఏనుగులు చనిపోయాయి. రాజభట్‌ఖావా, కాల్చిని రైల్వే స్టేషన్‌ల మధ్య శిఖరి గేట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది.
టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా, చంద్రబాబును అడుగుతున్నానని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు.
13వ రోజు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇల కైలాసంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలను వీక్షించి లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులయ్యారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేస్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్‌లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News