రేపు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు సాగనున్న మోడీ రోడ్ షో కొనసాగనుంది. రేపు ఉదయం మహబూబాబాద్ బహిరంగ సభ, మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు.
పవన్ కళ్యాణ్ విశాఖలో 50వేల చెక్కు ఇచ్చి జగన్‌ను దూషించడం మొదలుపెట్టారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణం అంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి... ఏంటయ్యా... మీ నీచ రాజకీయాలు అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
పెన్షన్ల విషయంలో చత్తీస్‌గఢ్, కర్ణాటకలో రూ.200, మధ్య ప్రదేశ్ , గుజరాత్‌లో రూ.600 ఇస్తున్నారని.. దివ్యాంగులకు అండగా నిలిచి రూ.4016 ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వారి కంటే మేము ఏ విషయంలో తక్కువ కాదు అని అన్ని సందర్భాల్లో దివ్యాంగులు నిరూపించారన్నారు. దివ్యాంగులకు చాలా మందికి వాహనాలు అందచేశామన్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. తిరుమల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవీఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 29న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోమ్ ఓటింగ్ పూర్తి అయిందని.. లక్షా 68 వేల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామన్నారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్‌ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు.