వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుకన్య సమృద్ధి యోజన, ప్రభుత్వ పొదుపు పథకం "బేటీ బచావో, బేటీ పడావో" చొరవలో కీలకమైన భాగం. ఆడపిల్లల ఉద్ధరణ, సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోడ్‌షో నిర్వహించి పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించిన అనంతరం కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ కోసం అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలను నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభినందించారు. భారతదేశంలో సోదరభావం తగ్గిపోతోందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి మరణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలో మసాచుసెట్స్‌లో వారి విలాసవంతమైన భవనంలో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తున్న ట్రక్కు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. సమీపంలో ఆగి ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి జరిగిన తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన వారం తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్‌లో 2024 నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సారి నూతన సంవత్సర వేడుకలను చేసుకోకూడదని పాకిస్థాన్ నిర్ణయించింది.
ఖతార్ కోర్టు భారత మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను తగ్గించిన తర్వాత, ప్రభుత్వం ఈ కేసులో పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై న్యాయ బృందంతో చర్చిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.