UP Shocker: సోషల్ మీడియా వేదికగా పాటలు వినడానికి మొబైల్ ఫోన్ అడిగిన భర్త కంట్లో కత్తెరతో పొడిచేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీలో జరిగింది. ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ (సీఓ) సవిరత్న గౌతమ్ సమాచారం ఇస్తూ, ఈ ఘటనపై అంకిత్ తన భార్య ప్రియాంకపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
Read Also: Bulldozer Action: కర్ణి సేన చీఫ్ హత్య.. నిందితుడు రోహిత్ రాథోడ్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
యూట్యూబ్‌లో పాటలు వినడానికి అంకిత్ ప్రియాంకను మొబైల్ ఫోన్ అడిగారని అధికారి తెలిపారు. మొబైల్‌లో పాటలు వినాలి అంటూ మొబైల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రియాంక అంకిత్ కంటిపై కత్తితో పొడిచేసింది. అంకిత్ కుటుంబ సభ్యులు అతన్ని సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.