Karni Sena Chief Shooter Rohit Rathore’s house in Jaipur faces Bulldozer Action: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఖతీపురాలోని రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించారని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కొట్టివేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీతో పాటు వారి సహచరులలో ఒకరైన ఉద్ధమ్‌ను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో డిసెంబర్ 9న చండీగఢ్‌లో అరెస్టు చేశారు. రోహిత్ రాథోడ్ చట్టవిరుద్ధమైన ఆస్తిని పోలీసుల సమక్షంలో పౌర సంస్థ అధికారులు కూల్చివేశారు.
Read Also: India-Italy: భారతీయులకు తలుపులు తెరిచిన ఇటలీ.. వేలాది మందికి ఉద్యోగాలు!
డిసెంబర్ 5న జైపూర్‌లోని కర్ణి సేన అధినేతను ఆయన ఇంటిలో కాల్చి చంపిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా, సుఖ్‌దేవ్‌సింగ్ గోగమేడి హత్యకు తానే కారణమని కాల్పులు జరిగిన వెంటనే ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
నిందితులను అరెస్టు చేసిన తర్వాత రోహిత్ గోదారా, అతని సన్నిహితుడు వీరేంద్ర చరణ్ ఆదేశాల మేరకు హత్య జరిగిందని నితిన్ ఫౌజీ పోలీసుల ముందు అంగీకరించాడు. రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ దేశం విడిచి పారిపోవాలని ప్లాన్ చేసారు. సుఖ్‌దేవ్‌సింగ్ గోగమేడిని చంపడానికి ఒక్కొక్కరికి రూ.50,000 హామీ ఇచ్చారు. కర్ణి సేన అధినేత హత్యకు భూ వివాదమే కారణమని పలు వర్గాలు తెలిపాయి. రోహిత్ గోదారాకు సంబంధించిన భూ వివాదాల్లో సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ప్రమేయం ఉన్నట్లు సమాచారం.