India-Italy: యూరప్‌కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ’ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ కార్మికుల కోటా సీజన్, నాన్-సీజన్ కోసం నిర్ణయించబడింది. నాన్-సీజనల్ కార్మికులకు, ఇటలీ 2023 సంవత్సరానికి 5 వేలు, 2024 సంవత్సరానికి 6 వేలు, 2025 సంవత్సరానికి 7 వేల కోటాను నిర్ణయించింది. ఈ ఒప్పందం వల్ల భారతీయ విద్యార్థులు కూడా ఎంతో ప్రయోజనం పొందనున్నారు.
Read Also: Pakistan: నవాజ్ షరీఫ్‌కు ఉపశమనం.. నామినేషన్‌ను ఆమోదించిన ఎన్నికల సంఘం
నాన్ సీజనల్ కార్మికులకు మొత్తం రిజర్వ్ కోటా 12 వేలుగా నిర్ణయించారు. సీజనల్ కార్మికులకు మొత్తం కోటా 8వేలుగా నిర్ణయించారు. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, 2023- 2025 మధ్య కార్మికుల కోటా పెరుగుతుంది. కార్మికుల కొరతను తీర్చేందుకు, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు ఇటలీ ప్రభుత్వం భారత్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయులు చదువు తర్వాత ఇటలీలో అవకాశాలు, ఇంటర్న్‌షిప్, వృత్తిపరమైన శిక్షణ పొందేందుకు మార్గం సుగమం కానుంది.
Read Also: 5,000 Chickens Burnt In Fire: అగ్నికి ఆహుతైన 5వేల కోళ్లు.. ఏం జరిగిందంటే?
తమ చదువులు లేదా వృత్తి శిక్షణ పూర్తి చేసిన తర్వాత స్వల్పకాలిక వృత్తిపరమైన శిక్షణ పొందాలనుకునే భారతీయ విద్యార్థులు 12 నెలల వరకు ఉండేందుకు ఈ ఒప్పందం అనుమతిస్తుంది. దీనితో భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఇటలీ నైపుణ్యాలు, శిక్షణా ప్రమాణాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్‌తో పాటు అనేక ఇతర దేశాలతో భారతదేశం ఇప్పటివరకు ఇటువంటి ఒప్పందాలపై సంతకం చేసింది. ఇటలీ జనాభాలో వృద్ధులు ఎక్కువవుతున్నారని, వృద్ధాప్య జనాభా పెరుగుతోందని, జనన రేటు చాలా తక్కువగా ఉందని తెలిసిందే.
Read Also: Qatar Court: 8 మంది భారత నేవీ మాజీ అధికారుల ఉరిశిక్ష వ్యవహారం.. మరణశిక్షను జైలుశిక్షగా తగ్గింపు!
ఈ రోజుల్లో ఇటలీ చైనాతో దూరాన్ని పెంచుకుంటూనే, భారత్‌తోనూ తన సంబంధాలను బలపరుస్తోంది. ఇటలీ ప్రధాని భారత ప్రధాని మోడీని పలుమార్లు కలిశారు. భారతదేశం, ఇటలీ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి అనేక ఒప్పందాలు పనిచేస్తున్నాయి. ఇంతకుముందు ఇటలీ చైనా అప్పుల ఉచ్చుగా పిలువబడే బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి దూరంగా ఉంది. ఇటలీ ఈ వైఖరి చైనాకు పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది. ఇటలీ మీదుగా యూరప్‌లోకి ప్రవేశించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇటలీ ప్రధాని ఇటీవల ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని పంచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టుని రీట్వీట్ చేస్తూ..‘‘ స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాశారు.