మావోయిస్టుల లింకు కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017 సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్‌పై కోర్టు తీర్పు వెలువడింది.
ప్రస్తుతం జరుగు (2024) సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో.. చేనేత వర్గాలైన కుర్నీ (నేసే), పద్మశాలిల పూర్తి మద్దతు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్‌కు ఉంటుందని ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తర్వాత దాదాపు ఒక నెల తర్వాత, నగదు కొరతతో ఉన్న దేశం పగ్గాలను రెండవసారి స్వీకరించిన షరీఫ్ సోమవారం పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు.
ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో 5వరోజుకు చేరుకున్నాయి.
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు.