Missile Attack: లెబనాన్ భూభాగం నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గాలియోట్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రమంపై ట్యాంకు విధ్యంసక క్షిపణి దాడి జరిగినట్లు.. ఈ దాడిలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడిన అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఈ ముగ్గురు భారతీయులు కేరళకు చెందిన వారని నివేదిక పేర్కొంది.
Read Also: Israel-Hamas War: గాజాలో పరిస్థితిపై భారత్ ఆందోళన.. శాంతి అలా అయితేనే సాధ్యం
సోమవారం ఉదయం 11 గంటలకు ఉత్తర ఇజ్రాయెల్‌లోని గెలీలీ ప్రాంతంలోని మోషవ్ (సామూహిక వ్యవసాయ సంఘం)లోని మార్గలియోట్‌లోని వ్యవసాయ క్షేత్రాన్ని ఈ క్షిపణి ఢీకొట్టిందని రెస్క్యూ సర్వీసెస్ మాగెన్ డేవిడ్ ఆడమ్ (MDA) ప్రతినిధి జాకీ హెల్లర్ తెలిపారు. మృతుడిని కేరళలోని కొల్లంకు చెందిన పట్నీబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం మృతిచెందిన వ్యక్తి మృతదేహం స్థానిక జీవ్ ఆస్పత్రిలో ఉందని అధికారులు తెలిపారు. మెల్విన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన సఫేద్‌లోని జివ్ ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఇతడు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినవాడు.
లెబనాన్‌లోని షియా హిజ్బుల్లా వర్గం ఈ దాడిని నిర్వహించిందని అనుమానిస్తున్నారు. ఈ గ్రూపు గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న యుద్ధం మధ్య హమాస్‌కు మద్దతుగా అక్టోబర్ 8 నుండి ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రతిరోజూ రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగిస్తోంది.