Israel-Hamas War: గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు. గాజా సంక్షోభంపై UNGA బ్రీఫింగ్‌లో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. భారతదేశానికి సంబంధించినంతవరకు, గాజాలో దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న యుద్ధంతో మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఈ యుద్ధం కారణంగా అక్కడ మానవత్వంపై సంక్షోభం తీవ్రమవుతుందని తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఫలితంగా పౌరుల జీవితాలు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు భారీగా నష్టపోయారు, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు భారీ ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు .. ఎంతంటే?
యుద్ధంలో మరణించిన పౌరుల మరణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ రాజీలేని వైఖరిని కలిగి ఉంది. బందీలుగా ఉన్న వారందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ యుద్ధాన్ని నిలిపివేయడం, గాజా ప్రజలకు తక్షణమే మానవతా సహాయం అందించడం చాలా అవసరం. రెండు దేశాల పరిష్కారానికి మద్దతివ్వడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇరుపక్షాల మధ్య అర్థవంతమైన చర్చలే శాశ్వత శాంతిని కలిగిస్తాయని ఆమె తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడులే సంఘర్షణకు కారణమని పేర్కొంది. ఆ దాడులను నిర్ద్వంద్వంగా ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు గాజా ప్రజలకు మానవతా సహాయం తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని రుచిరా కాంబోజ్ పిలుపునిచ్చారు.