ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో రెండోసారి అడుగు పెట్టనున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం పశ్చిమ చంపారన్ జిల్లా ప్రధాన కార్యాలయం బెట్టియా పట్టణాన్ని సందర్శించి రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.
పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు మంచి ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాపై రష్యాకు వెళ్లారు. కానీ ఇప్పుడు వారు ఉక్రెయిన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ భారతీయులు రష్యా సైన్యంలో పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుల కుటుంబాలు ప్రభుత్వం సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
హర్యానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హర్యానాలోని రేవారిలో బుధవారం హర్యానా రోడ్‌వేస్ బస్సు కారును ఎదురుగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నిపుణుల కమిటీ నేడు(బుధవారం) రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్‌ఏకు లేఖ రాశారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.
కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కోల్‌కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు దేశం పురోగతిని ప్రదర్శించే మైలురాయి ప్రాజెక్ట్‌గా భావించవచ్చు.