T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను తేరుకోలేని దెబ్బకొట్టిన జింబాబ్వే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి, జింబాబ్వే సూపర్-8 బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 17) జరగాల్సిన జింబాబ్వే – ఐర్లాండ్ మ్యాచ్ నిరంతర వర్షం కారణంగా రద్దు అయ్యింది. పల్లెకెలెలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో జింబాబ్వే – ఐర్లాండ్ రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. రెండు ఓటములతో సూపర్ 8 ఛాన్స్ కోసం ఇతర జట్ల ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో ఉన్న ఆస్ట్రేలియాకు.. జింబాబ్వే – ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ డ్రాగా ముగియడం పెద్ద షాక్‌కు గురి చేసింది.
READ ALSO: OLA CEOపై అరెస్ట్ వారెంట్.. విషయం ఏంటంటే..?
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.00 గంలకు ఐర్లాండ్ – జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ రెండు జట్టుల మధ్య వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. వరుణుడు కరుణించకపోవడంతో ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించి, రెండు జట్టులకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియాపై భారీ ఎఫెక్ట్ చూపింది. గ్రూప్ బీలో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్ ఆడుతున్నాయి. ఇప్పటికే ఒమన్ ఈ మెగా టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. ఇదే సమయంలో శ్రీలంక 6 పాయింట్లతో సూపర్ 8కి క్వాలిఫై అయింది. 5 పాయింట్లతో ఉన్న జింబాబ్వేకు, తాజాగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ రావడంతో 8కు క్వాలిఫై అయింది. దీంతో గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్ ఈ మెగా టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాయి.
ఫిబ్రవరి 20న ఆస్ట్రేలియా – ఒమన్ మధ్య జరిగే మ్యాచ్ ఆసీస్ నామమాత్రపు మ్యాచే. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్… గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్… గ్రూప్ డీ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్ 8కు అర్హత సాధించాయి. తాజాగా గ్రూప్ బీ నుంచి శ్రీలంకతోపాటు జింబాబ్వే సూపర్ 8కి అర్హత సాధించింది. గ్రూప్ ఏలో భర్తీ కావాల్సిన స్థానం కోసం పాకిస్థాన్, యూఎస్‌ఏ తలపడుతున్నాయి.
READ ALSO: Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లా.. ‘వారణాసి’ నుంచి కళ్లు చెదిరే అప్‌డేట్!
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!