కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
భారతీయులపై 'జాత్యహంకార' వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తైవాన్ మంత్రి క్షమాపణలు చెప్పారు. భారతీయ వలస కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కార్మిక మంత్రి హ్సు మింగ్-చున్ మంగళవారం క్షమాపణలు చెప్పారు. కొందరు దీనిని "జాత్యహంకారం" అని విమర్శించారు.
వైట్ హౌస్ రేసులో సూపర్ మంగళవారం అతిపెద్ద రోజు. అధ్యక్ష ప్రాథమిక క్యాలెండర్‌లో అత్యధిక రాష్ట్రాలు ఓటు వేసే రోజు. మార్చి 5న, 16 యూఎస్ రాష్ట్రాలు, ఒక భూభాగంలోని ఓటర్లు అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేశారు. ప్రెసిడెంట్ జో బైడెన్, అతని ముందున్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..!
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు.
ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు.
వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు.