యూపీఏ హయాంలోని పాలనకు, నరేంద్ర మోడీ సర్కారుకు మధ్య ఉన్న తేడాపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
భారత్‌లో నిరుద్యోగం పాకిస్థాన్‌లో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఎదురుదాడి చేసింది. దీనితో పాటు, పొరుగు దేశానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్న కూడా ఆ పార్టీ లేవనెత్తింది.
ప్రముఖ మహానంది క్షేత్రంలో 6 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అభిషేకాలు, విశేష పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ చాలా మంది పార్టీలు మారుతున్నారు. అధికార వైసీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జి భూమా కిషోర్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు.
పాతికేళ్ల కాలం నుంచి రాజమండ్రి బాగా తెలుసని.. గడిచిన ఐదేళ్లలో రాజమండ్రి డెవలప్మెంట్ కనిపిస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి చిత్తశుద్ధితో తన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో మార్గాని భరత్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు.