CM Chandrababu: ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్‌నాథ్ షిండే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. చంద్రబాబు భేటీకి సంబంధించిన ఫోటోలను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు.
Read Also: Somasila Project: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన మంత్రులు
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే దానిపై ప్రధాన చర్చ జరిగిందని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ భేటీలో కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భుసే, శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఉన్నారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్.య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
आंध्र प्रदेशचे मुख्यमंत्री चंद्राबाबू नायडू यांनी आपल्या मुंबई भेटीदरम्यान आज वर्षा निवासस्थानी येऊन सदिच्छा भेट घेतली.
यावेळी त्यांचे शाल आणि पुष्पगुच्छ देऊन स्वागत करण्यात केले तसेच श्री विठ्ठल रखुमाईची मूर्ती देऊन त्यांना सन्मानित करण्यात आले.
या भेटीत एकमेकांना लागून… pic.twitter.com/1rEafkRe5O
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 14, 2024