Story Behind the Word “Cyclone”: భారత్‌లోనే ఉద్భవించిన “సైక్లోన్” అనే పదం.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Behind the Word “Cyclone”: సైక్లోన్ అనే పదం తరచూ వింటూనే ఉంటాం.. అది ఏర్పడిన ప్రాంతం.. పుట్టిన సమయాన్ని పట్టి కూడా కొన్ని సార్లు సైక్లోన్ పేర్లు పెడుతూ ఉంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సైక్లోన్ అనే పదం పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథే ఉంది.. నేడు ప్రపంచవ్యాప్తంగా వినిపించే “Cyclone” అనే పదం భారతదేశంతో అనుబంధం కలిగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. 19వ శతాబ్దంలో భారతదేశంలో పనిచేసిన బ్రిటిష్ నౌకాధికారి Henry Piddington ఈ పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు..
గ్రీకు పదం నుంచి “Cyclone” వరకు
“Cyclone” అనే పదం గ్రీకు పదమైన kyklos / kuklos నుంచి వచ్చింది. దీనికి అర్థం “వృత్తం” లేదా “చుట్టం.” పిడింగ్టన్ బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులను అధ్యయనం చేస్తూ, గాలి ఒక ప్రశాంత కేంద్రం చుట్టూ వలయాకారంలో తిరుగుతుందని గమనించాడు. ఈ భ్రమణాన్ని ఆయన “పాము కాయిల్” (snake coil) తో పోల్చాడు.
Also Read
- India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
- Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
- Flying Car: ఇంజినీరింగ్ డిగ్రీ లేదు..13 ఏళ్ల కష్టంతో ‘‘ఫ్లయింగ్ కార్’’ తయారీ..
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
బంగాళాఖాతం పరిశోధనలు
1830–1840ల మధ్య పాత నౌకా లాగ్‌బుక్‌లను పరిశీలించిన పిడింగ్టన్, బంగాళాఖాతంలో తుఫానులు మెలికలు తిరిగే స్వభావం కలిగి ఉంటాయని వివరించాడు. పై నుంచి చూస్తే అవి పాము చుట్టలా కనిపిస్తాయని పేర్కొన్నాడు. 1848లో ఆయన రచించిన పుస్తకం The Sailor’s Horn-Book for the Law of Storms లో తొలిసారి “Cyclone” అనే పదాన్ని ఉపయోగించాడు. నావికులు తుఫానుల దిశ, భ్రమణ స్వభావాన్ని అర్థం చేసుకుని సురక్షితంగా నావిగేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పదాన్ని ప్రవేశపెట్టాడు.
IMD స్థాపనకు ముందు
ఆ సమయంలో భారతదేశంలో అధికారిక వాతావరణ శాఖ లేదు. తరువాత 1875లో India Meteorological Department స్థాపించబడింది. కానీ పిడింగ్టన్ దానికి చాలా ముందే తుఫానుల నియమాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఈరోజు “సైక్లోన్” అనే పదం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగంలో ఉంది. ఫణి, మోచా వంటి తుఫానుల గురించి విన్నప్పుడల్లా, ఆ పదానికి భారతదేశంతో ఉన్న ఈ చారిత్రక అనుబంధాన్ని గుర్తు చేసుకోవచ్చు. మొత్తంగా “Cyclone” అనే పదం గ్రీకు మూలం కలిగి ఉన్నప్పటికీ, దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి శాస్త్రీయంగా నిర్వచించిన వ్యక్తి భారతదేశంలో పనిచేసిన హెన్రీ పిడింగ్టన్. అతని పరిశోధనలు తుఫానుల అవగాహనలో కీలక మైలురాయిగా నిలిచాయి.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!