Mirzapur 3: ఈ నెల 5న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్-3’ సరికొత్త రికార్డు సృష్టించింది. ‘మీర్జాపూర్ సీజన్ 3’అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతోంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం భారత్‌లో అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. మీర్జాపూర్ మూడో సీజన్‌ను 180కి పైగా దేశాల్లోని ప్రేక్షకులు వీక్షించారు. దాని ప్రారంభ వారాంతంలో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ దేశాలలోటాప్ 10 ట్రెండింగ్ జాబితాలోఉండడం గమనార్హం.
Read Also: Anant ambani wedding: పెళ్లికి హాజరైన ప్రముఖులు వీళ్లే..!
గతంలో వచ్చిన ‘మీర్జాపూర్-2’ రికార్డును కూడా బద్దలు కొట్టిందట. ‘మీర్జాపూర్ సీజన్ 3’కి గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే, ‘మీర్జాపూర్’ అభిమానులకు మేకర్స్ మరో భారీ బహుమతిని అందించారు. సీజన్-4 షూటింగ్ కూడా మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు. మూడో సీజన్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్, రాజేష్ తైలాంగ్, షీబా చద్దా, మేఘనా మాలిక్, మను వంటి చాలా మంది నటీనటులు నటించారు.