Komatireddy Rajagopal Reddy: కురియన్ కమిటీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఒక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ సమాధి అయ్యిందన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ స్వేచ్ఛ ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ ఉండరని.. హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడని ఆయన పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోమని, ఆయన జైలుకు పోయే వ్యక్తి అంటూ విమర్శించారు.
Read Also: MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
కురియన్ కమిటీని తాను కలిశానని.. పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని అడిగారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. భువనగిరి ఇంఛార్జ్‌గా మెజారిటీతో గెలిపించానని చెప్పానన్నారు.
భువనగిరిలో బీజేపీ గెలుస్తుందని టాక్ ఉండేదని.. తాను ఇంఛార్జ్‌గా వెళ్లాక కాంగ్రెస్ వైపు మళ్లిందన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి కలిసి కట్టుగా పని చేశామన్నారు. రెండు లక్షల మెజారిటీ వచ్చిందని కురియన్ కమిటీకి చెప్పానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.