రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య తల్లిదండ్రులు ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేని సంఘటనలు జరిగాయని కన్నీళ్లు పెట్టుకున్నారు.
రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్‌లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్), జీఏడి అధికారులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది.
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జులై 24 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గురువారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్ ఆఫీసర్‌ని అంటూ యువతిని బురిడీ కొట్టించి పెళ్లి చేసుకోవడంతో పాటు.. ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. మళ్లీ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.