Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగల పూడి అనిత పేర్కొన్నారు. యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ను హోం మంత్రి అనిత పరామర్శించారు. కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. విశాఖలోని సెవెన్ హిల్స్ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును హోంమంత్రి పరామర్శించారు. ఈ కేసులో నిందితుడికి చట్టం ప్రకారం కఠినంగా శిక్ష ఉంటుందని ఆమె అన్నారు. పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
Read Also: Rape : నెలల పాపపై అత్యాచారం.. కఠినంగా శిక్షించాలని డిమాండ్