Bharateeyudu-2: భారతీయుడా మజాకా.. గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్‌కు..
- భారతీయుడు-2 సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్
- గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్‌కు వచ్చిన కమల్ అభిమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu-2: లోకనాయకుడు కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు-2′(Indian-2). 28 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్ హాసన్ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.
ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాపై కమల్ హాసన్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. చెన్నైలో ఓ అభిమని ‘భారతీయుడు-2’ సినిమాను చూసేందుకు వినూత్న రీతిలో థియేటర్ వద్దకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో కమల్ పోషించిన ‘సేనాపతి’ పాత్రలా డ్రెస్ ధరించి.. తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్ వద్దకు వచ్చాడు. చేతిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు.
#WATCH | Tamil Nadu: A fan of actor Kamal Haasan arrives at a film theatre in Chennai to watch ‘Indian 2’, dressed up as the actor’s character from the film. pic.twitter.com/xRmnLkjzNN
— ANI (@ANI) July 12, 2024
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!