CM Chandrababu: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డిలు స్వాగతం పలికారు. క్షేత్రంలో జరుగుతున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డోకిపర్రు మహా క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Read Also: Sambhal Shiva Temple: ముస్లిం ఏరియాలో బయటపడ్డ 46 ఏళ్ల నాటి శివాలయం.. ఎలా గుర్తించారంటే? (వీడియో)
ఆలయ సంప్రదాయం ప్రకారం సీఎం చంద్రబాబును సత్కరించి స్వామివారి ఫోటో లడ్డు ప్రసాదాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు అందజేశారు. డోకిపర్రు మహాక్షేత్రం అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి క్షేత్రాలు మరిన్ని ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. డోకిపర్రు మహాక్షేత్రం విశిష్టతను సీఎం చంద్రబాబుకు కృష్ణారెడ్డి, వేద పండితులు వివరించారు.