లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. బాలుడి ఆరోగ్యం గురించి ఎంతో సానుభూతితో ఉన్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నందును శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు.
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) ఆదివారం కన్నుమూశారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ.. సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేత ఎవరనే విషయం తేలిపోయింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8గా నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు.
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.
గ్రూప్-2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా ప్రారంభానికి ముందే ఓ అభ్యర్థి ఫోల్డెడ్ మొబైల్ ఫోన్‌ను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చాడు.
హీరో అల్లు అర్జున్ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. అంతకు ముందు అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు.
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్‌తో మోహన్ బాబు అన్నారు.
కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్‌పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.