Vijay Paul: గతంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 2021లో సీఐడీ కార్యాలయంలో చోటుచేసుకున్న దాడి కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను ప్రకాశం పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విషయంలో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ విచారణ ముగిసింది. రెండు రోజులు పోలీస్ కస్టడీకి తీసుకుని విజయ్ పాల్‌ను ఎస్పీ దామోదర్ విచారించారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరు జైలుకు విజయ్ పాల్‌ను తరలించారు. రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో గత నెల 26న విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు.
Read Also: YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు
రఘురామ కృష్ణంరాజుపై ముసుగు ధరించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నలుగురిపై ఎస్పీ దామోదర్ ఆరా తీశారు. రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేయడం, కస్టోడియల్ టార్చర్‌కు ప్రేరేపించిన వ్యక్తులపై ఆరా తీశారు. దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ రెండు రోజులు 50కి పైగా ప్రశ్నలు అడిగారు. తెలియదు, గుర్తు లేదు అంటూ విజయ్ పాల్ సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజును కొట్టిన నలుగురి వివరాలను విజయ్‌పాల్ నుంచి రాబట్టలేకపోయినట్లు తెలిసింది.